Thursday, 5 November 2026

కొత్తపల్లి కానుకుంట గ్రామలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అధికారిని

 

 

 

 

 

 

 

జిన్నారం మే 15 జనంసాక్షి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మండల కేంద్రంలోని కొత్తపల్లి కానుకుంట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జయశ్రీ రాజ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా అదన కలెక్టర్ ఆదేశాలనుసారం పత్తి కేంద్రంలో సరిపడా హమాలీలు ఉండేలా సెంటర్ నిర్వాహకులు చూసుకోవాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి రైతుల వివరాలను వెంబడే టాబ్ ఎంట్రీ నమోదు చేసుకోవాలని మరియు కేంద్రం పుస్తకాలను రోజువారీగా నమోదు చేస్తూ వ్యవసాయ విస్తరణ అధికారి గారి సూచనల మేరకు రైతులకు తోకనిచ్చిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించడం జరిగింది మరియు రైతులందరూ ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టి త్యాగ్యులర్లో వేసి కేంద్రానికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా రవాణా సమస్యలు మిల్లర్ల సమస్యలు ఉన్న సంచుల సమస్యలు ఉన్నట్లయితే మండల జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు సోమవారం కొత్తపల్లిలో 9 మంది రైతుల నుండి 470 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది కానుకుంటలో1068.40 పిండం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంబడి శివకుమార్, ఎపిఎం మొహారనీస, కృష్ణ సీసీలు జయమ్మ, రత్నా, కేంద్రాల నిర్వహకులు తదిర్లు ఉన్నారు.