Thursday, 5 November 2026

పేదింటి పెళ్ళికి మేనమామ కెసిఆర్. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 

 

 

 

 

 

నెన్నెల, మే 15, (జనంసాక్షి )పేదింటి పెళ్ళికి మేనమామ కెసిఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఆయన నెన్నెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆడపిల్ల పెళ్లి అంటేనే తల్లిదండ్రులు గుండెల మీద కుంపటిగా భావించే వారని, ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఏ ఆడపిల్ల తండ్రి పెళ్లి కోసం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో పేదింటి ఆడపిల్ల పెళ్ళికి మేనమామగా వ్యవహరించి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఒక్కో ఆడకూతురు పెళ్ళికి లక్షా వెయ్యి నూట పదహార్లు ఇస్తున్నాడని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలవడం గొప్ప విషయం అన్నారు. మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 31,03,596 విలువ చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.