బెల్లంపల్లి, జూన్ 5, (జనంసాక్షి )
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నేడు నిర్వహిస్తున్న విద్యుత్ విజయోత్సవ కార్యక్రమం ఆర్పీ హాల్ లో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ కు ముందు కరెంట్ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణకు వచ్చిన తరువాత ఎలా ఉంది అనేది మనం బేరీజు వేసుకోవాలి, త్యాగాల పునాదుల మీద, 12వందల మంది అమరుల అయ్యి, కేసీఆర్ గారు చావు నోట్లోకి పోయి తెలంగాణ సాధించారు తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దని కేసీఆర్ పట్టుబట్టి బంగారు తెలంగాణ దిశగా నడిపారు 29క్రాప్స్ట్ లో ముందు నిలిపిన ఘనుడు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని 24గంటల కరెంట్ అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గతపాలకులు 6 నుండి 8 గంటలు కరెంట్ ఇచ్చే వారు ఆ కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితితేలంగాణ రాకముందు ఇండస్ట్రీస్ కు పవర్ హాలిడేస్ ఇచ్చే వారు ప్రజలకు విద్యుత్ ఎలా అందించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు నిరంతరం శ్రమించి నేడు 24 గంటల కరెంట్ అందిస్తు దేశంలోనే అగ్రభాగాన నిలుపుతున్నరుఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలకు పవర్ హాలిడేస్ వారానికి రెండు రోజులు సెలవు ఇచ్చే వారుతెలంగాణ వచ్చాక నేడు పవర్ హాలిడేస్ లేవు ఇండస్ట్రీలకు నిరంతర విద్యుత్ ఇస్తున్న గొప్ప రాష్ట్రం తెలంగాణనాయి బ్రాహ్మణులకు 250 యూనిట్స్ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రజకులకు,దళితలు 101 యూనిట్స్ సబ్సిడీ విద్యుత్ అందిస్తూ కేసీఆర్ గారు తమ ఉధారతను చాటారుగతంలో గంటల కొద్దీ విద్యుత్తు కోత ఉండేది ప్రజలు,రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు
గతంలో ఇండస్ట్రీలు, ప్రజలు ఇన్వర్టర్స్, జనరేటర్లు మీద ఆధారపడాల్సి వచ్చేది. వచ్చిరాని కరెంట్ తో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేవి నాడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెల్వని పరిస్థితిరైతన్నలు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేసే వారునేడు కేసీఆర్ నాయకత్వనా తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది నేడు రైతులకు ప్రజల వినియోగం కోసం 24 గంటల కరెంట్ అందిస్తూ ప్రజల రైతుల గోస తీర్చిన మహనాయకుడు కేసీఆర్
నాడు రైతన్నలకు రాత్రులు కరెంట్ ఇస్తే పంటలకు నీరు పెట్టడానికి వెళ్తే పాము కాటుకు రైతులు బలయ్యే వారు నేడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదుతెలంగాణ రాకముందు 18 లక్షల విద్యుత్ వినియోగదారుల ఉండేవారు నేడు 26 లక్షలు వినియోగదారులు ఉన్నారుగతంలో ఎస్సి,ఎస్టీలకు 50 యూనిట్ల మేర సబ్సిడీ ఇచ్చే వారు నేడు 101 యూనిట్ల సబ్సిడీ తెలంగాణ సర్కారు అందిస్తుందితెలంగాణ రాకముందు నాయిబ్రహ్మానులు, రజకులు విద్యుత్తు సబ్సిడీ లేదునేడు 250 యూనిట్ల మేర కరెంట్ ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందివిద్యుత్ కోతల నుండి అధిగమించుకొని గొప్పగా నేడు కరెంట్ ఇచ్చుకుంటున్నాంరైస్ మిల్లర్స్ ఎచ్.పి 99 నుండి 125 మార్చాలని కొరగానే 6 లక్షల వరకు లాభం జరుగుతుందని. అసెంబ్లీలో మాట్లాడి సమస్య పరిష్కారం చూపాము. అన్ని వర్గాలను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. విద్యుత్తు ఉద్యోగులు కాంట్రాక్టు బేసిక్ నుండి రెగ్యులర్ చేసిర్రు,విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచిర్రు. కేసీఆర్ ఇంట్లో పెద్ద మనిషి లాగా గొప్పగా తెలంగాణ మార్చారు. మన ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరి పై ఉంది.రజకులు,నాయి బ్రహ్మణులు మీ షాప్స్ దగ్గరికి వచ్చిన కస్టమర్లకు మీరు పొందిన లబ్ది,కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చెప్పాలిగతపాలకులు 67ఏండ్లు పాలించి తెలంగాణ అభివృద్ధిని ఆగం చేసిర్రు. తెలంగాణ సర్కారు మొదటి జీవో ప్రభాకర్ రావు గారిని నియమించి తెలంగాణ విద్యుత్ సంక్షోభం నుండి అధిగమించాము
తెలంగాణ సర్కారు విద్యుత్తు ఉద్యోగులను గౌరవించుకుంటుంది కాబట్టి వారు కూడా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.రజకులు,నాయీబ్రహ్మాణులు,దళితులు విద్యుత్తు లబ్ది పొందుతున్నారు కాబట్టి నేడు వారిని ఈ వేధికద్వారా గౌరవించుకోవడం జరుగుతుందిపవర్ డిపార్ట్మెంట్ పవర్ ఫుల్ గా ఉంటారు కాబట్టి మనకు విద్యుత్ అద్భుతంగా అందిస్తున్నారు.అట్టడుగు బాగానే ఉన్న వారిని ఆదుకోవడం ప్రభుత్వ లక్ష్యంకేసీఆర్ గారే లేకుంటే తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి కాకుండేదివిద్యుత్ శాఖలో గతంలో ధర్నాలు రాస్తా రోకోలు చేసే వారు కానీ ఇప్పుడు అట్లాంటివి లేవుకేసీఆర్ కంటే మంచి నాయకులు కేసీఆర్ కంటే గొప్ప పాలన మనకు దొరకదు కాంగ్రెస్ వాళ్ళు వాళ్లకు వాళ్ళు తన్నుకుంటుర్రు వాళ్ళు మనకేం చేస్తారుబీజేపీ వాళ్ళు దేవుళ్ళ పేర్లు చెప్పి పంచాయితీ పెడుతున్నారు మనమందరం కూడా దేవుళ్లను మొక్కుతున్నాం గొప్పగా పూజిస్తున్నాం
దేశంలో రాష్ట్రంలో ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటున్నారుకానీ బీజేపీ పంచాయితీలు పుట్టింస్తుంది జాగ్రత్తగా ఉండాలిరజకులు నియోజకవర్గంలో మూడు దోబీ ఘాట్స్ కడుతున్నాం వినియోగించుకోవాలి. ప్రజలను కడుపులో పెట్టుకొని చూస్కుంటున్న కేసీఆర్ గారిని కాపాడుకోవాలి.ఈ కార్యాక్రమానికి విద్యుత్ అధికారులు, ఎస్సీ పి మధుసూదన్ రావు, ఎస్ ఏ ఓ సంజీవరావు, అర్బన్ డి ఈ శంకేష్ మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి తోపాటు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు విద్యుత్ సబ్సిడీ పొందిన రజకులు,నాయి బ్రాహ్మణులు, ఎస్సి,ఎస్టీలు,చెర్మన్, వివిధ సంఘాల నాయకులు,ప్రభుత్వ మద్దతు దారులు,డివిజన్ అధ్యక్షులు,కేసీఆర్ అభిమానులు,బిఆర్ఎస్ బలగం తదితరులు హాజరయ్యారు ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా -శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.




