కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయం : దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్.

దౌల్తాబాద్ ఆగష్టు 21, జనం సాక్షి.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే గా కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఎమ్మెల్యే అభ్యర్థి గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు లకు కృతజ్ఞతలు తెలిపారు.రెండు మార్లు మెదక్ పార్లమెంటు సభ్యులుగా ప్రజల కోసమే పనిచేస్తూ, సీఎం కేసీఆర్ , మంత్రి తన్నీరు హరీశ్ రావు సహకారంతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ, అభివృద్ధి, సంక్షేమం లో ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు.కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.