హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌కు షాక్ తగిలింది. కొత్త ఎక్సైజ్ పాలసిని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు ఆ పాలసికి స్పందన కరువైంది. కొత్త మద్యం షాపులకు దరఖాస్తుకు ఇవాళ్టితో ఆఖరు తేదీ. ఇప్పటికీ అనుకున్నంతగా దరఖాస్తుదారులు అసక్తి చూప లేదు. దీంతో దరఖాస్తుల అమ్మకానికి గడువు పొడిగించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.కొత్త మద్యం షాపులపై గులాబీ సర్కార్ పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. కొత్త మద్యం పాలసీతో ఖాళీ అయిన ఖజానాను నిండా నింపాలనుకున్న సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కొత్త మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే సర్కార్ అనుకున్నంతగా దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. దీంతో..ఆబ్కారీ శాఖ తర్జనబర్జన పడుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 వేల 2 వందల 16 షాపులున్నాయి. ఇందులో కేవలం 15 వందల వరకే దరఖాస్తులు వచ్చాయి. దీంతో..మరోసారి గడువు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అసలు కారణం పెరిగిన లైనెన్స్ ఫీజులు, మార్జిన్‌ను పెంచకపోవడమేనని సమాచారం. ఈ కారణంగా మద్యం వ్యాపారుల్లో ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది.పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్, సైబరాబాద్‌కు, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో తక్కువ దరఖాస్తులొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవే ఉన్నాయి. వీటిలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచే అధికంగా వచ్చాయి. ఒక షాప్‌కు ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిన యజమానిని ఎంపిక చేయడం వంటి కారణాలు కూడా మద్యం వ్యాపారులు వెనక్కు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.గతంలో లైసెన్స్ ఫీజును తగ్గించినప్పటికీ జంటనగరాలతో పాటు వరంగల్ కార్పొరేషన్‌తో కలసి మొత్తం 130 షాపులు మిగిలే ఉన్నాయి. ఈసారి ఏకంగా 20 శాతం ఫీజు పెరిగింది. దీంతో….వ్యాపారులపై భారం మోపడం ఖాయం. ఇదే పరిస్థితి కొనసాగితే రిటైల్ షాపుల నిర్వహణ అంతా సులువు కాదని తెలుస్తోంది.
కొత్త మద్యం పాలసీతో సర్కార్‌కు షాక్




