మొక్కలు నాటిన ఎంపి వినోద్
హైదరాబాద్,జూలై30(జనం సాక్షి): హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంగా విజయవంతంగా కొనసాగుతుంది. కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్వీకరించారు. ఇవాళ ఎంపీ వినోద్ తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆయన మరో ముగ్గురికి హరిత సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రమేశ్ బాబు, వి. సతీశ్ కుమార్‌లకు హరిత సవాల్ విసిరినట్లు ఎంపీ వినోద్ ట్వీట్ చేశారు.




