కొనసాగుతున్న జిపి కార్మికుల సమ్మె
బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 15
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు చేస్తున్నటువంటి సమ్మె శనివారం నాటికి పదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు పర్మినెంట్ చేయలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు