బెల్లంపల్లి, మే 26, (జనంసాక్షి )
తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 41వ రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఐకేపీ వీవోఏలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. నెన్నెలలో వీవోఏల దీక్ష శిబిరంలో ఐకేపీ వీవోఏలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వీవోఏల యూనియన్ మండల నాయకుడు కోట శంకర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో బతుకు బండిని లాగిస్తున్నామని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బాధాకరం అన్నారు. వీవోఏల ఉద్యమానికి అన్ని పార్టీలు అండగా నిలవాలని అన్నారు. డిమాండ్లు నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాదించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు అనిల్, రవి, కవిత, సంధ్య వీవోఏలు పాల్గొన్నారు.- వడదెబ్బకు వీవోఏకు అస్వస్థత.నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో శనివారం మెట్ పల్లి వీవోఏ దుగుట సంతోష్ ఎండల తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి వీవోఏలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఉన్నత చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. గత 41 రోజులుగా సమ్మె చేపట్టి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారిస్తుందని, దీనితో వీవోఏలు పిట్టల్ల రాలుతున్నారని వెంటనే వీవోఏల సమస్యలు పరిష్కరించాలని వీవోఏల యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి దుర్గం మల్లేష్ డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న వీవోఏల రిలే నిరాహార దీక్షలు.




