జనంసాక్షి, మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో శుభకార్యాలకు బ్రాహ్మణులు వస్తలేరని చెప్పిన పుట్ట మధు అది అవాస్తమని, వారి వృత్తి పరంగా ఎవరు పిలిస్తే వారి ఇండ్లలోకి వెళ్తారని శ్రీధర్ బాబుపై జడ్పీ చైర్మన్ పుట్ట మధు చౌక బారు విమర్శలు చెస్తే ప్రజలు ఎవరు నమ్మరు అని మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేగ్గం రాజేష్ అన్నారు. మంథని అంబేద్కర్ నగర్ లో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు దళితుల పై దుద్దిళ్ళ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంథని మున్సిపల్ ఎస్సీ సెల్ నాయకుడు పీక మల్లయ్య తదితరులు మాట్లాడారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీధర్ బాబు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఏ ఒక్క మాల ,మాదిగలకు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మంథని శ్రీ పాద కాలనీలో దళితులకు భూమి ఇచ్చిన ఘనత శ్రీధర్ బాబుది అని,
వరదల వల్ల అంబేద్కర్ నగర్ లో ఉండే ఇండ్లలోకి నీరు చేరి ఇండ్లు మొత్తం నీట మునిగి నిత్యవసరాలు లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంటికొక 25 కిలోల బియ్యం బస్తాను పంపిణీ చేసింది.. వరదల సమయంలో శ్రీధర్ బాబు తప్ప ఏ ఒక్క నాయకుడు ఇక్కడ కనిపియ్యలేదన్నారు.
కేవలం ఒక్క కులానికో, మతానికో చెందిన నాయకుడు కాదు శ్రీధర్ బాబు..అన్ని వర్గాల కు చెందిన నాయకుడు శ్రీధర్ బాబు అని అన్నారు. కళ్యాణ కర్ణాటకలో శ్రీధర్ బాబు ఇన్చార్జి చేసిన పరిధిలో 26 సీట్లు గెలిస్తే..పది సీట్లు వచ్చాయని పుట్ట మధు మాట్లాడడం సరికాదన్నారు. శ్రీధర్ బాబు స్వాగత కార్యక్రమన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు ఇచ్చిన ఆధార అభిమానాన్ని చూసి దళిత బహుజనలంత శ్రీధర్ బాబు వెంటే ఉన్నారని ఓటమి భయంతో ఇలాంటి చౌకబార విమర్శలు చేస్తున్నారని, మరోమారు ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
దళితుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత దుద్దిళ్ళ కుటుంబానిది




