Wednesday, 4 November 2026

విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి – డిఇఓ డి.మాధవి

జనంసాక్షి, మంథని : విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంనను అందిపుచ్చుకొని దేశ అభివృధ్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి అన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక విద్యలో విషయ అవగాహనను పెంపొందించేందుకు ఈ ప్రత్యేక వేసవి శిబిరంను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)మంథని అటల్ టింకరింగ్ ల్యాబ్ లో పాఠశాల విద్యాశాఖ,విజ్ఞాన్ ఆశ్రమం పుణే, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ శిబిరంను శనివారం డి.ఇ.ఓ ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకత, జిజ్ఞాసతో వినూత్న ఆవిష్కరణలకు బీజం వేయాలన్నారు. 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో విద్యార్థులకు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, మెకానికల్ టూల్స్, త్రిడీ ప్రింటింగ్,పేపర్ ఓరిగామి,క్యాడ్, బేసిక్,అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలపై విద్యార్థులకు శిక్షణ నివ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.కొమురయ్య,ఉపాధ్యాయులు బి.శంకర్,పరంజ్యోతి పుణే రిసోర్స్ పర్సన్స్ జి.పురుషోత్తం,సుమిత్ ఠాక్రే పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.