Monday, 2 November 2026

వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి , మంథని : స్థానిక శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో శ్రీవాసవి మాత జయంతి వేడుకలను భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జయంతోత్సవాలను పురస్కరించుకొని స్థానిక శ్రీకన్యకా పరమేశ్వరీ ఆలయంలో గత నెల రోజులుగా నిత్యం రాత్రి మూడు గంటల పాటు ప్రత్యేక భజన కార్యక్రమాలను కొనసాగించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గర్భాలయంలోని మూల మూర్తికి, ఉత్సవ మూర్తికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి శాస్త్రాకంగా హోమం నిర్వహించి పూర్ణాహుతి ఇచ్చారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేశారు. అధిక సంఖ్యలో అమ్మవారికి భక్తులకు తీర్థప్రసాదల విరతరణ తోపాటు అన్నదానం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథం పై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి సాయంత్రం నుంచి రాత్రి వరకు పురవీధుల్లో అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు. ఈకార్య క్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.