Wednesday, 4 November 2026

కొనసాగుతున్న వీవోఏల రిలే నిరాహార దీక్షలు.

 

 

 

 

 

ఝరాసంగం మే 8 (జనంసాక్షి )తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 22 వ రోజుకు చేరుకున్నాయి. ఝరా సంగం మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రం లో ఐకేపీ వివోఏ లు వెట్టి చాకిరీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షురాలు పద్మారాణి, కార్యదర్శి నింగమ్మా ప్రధాన కార్యదర్శి ఖాజామియా, కోశాధికారి వసంత ,సిద్దన్న, మహ్మద్,సూర్ రెడ్డి, సిరాజ్, రాజు పటేల్,సుర్ రెడ్డి,మహమ్మద్,సోపియోద్దీన్,నర్సింలు,,మాధవి అనిత చిన్నిసంధ్యారాణి, పద్మ ,మరియమ్మనాగమణి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.