Friday, 6 November 2026

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ.

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ.
నెన్నెల, డిసెంబర్ 17, (జనంసాక్షి )
మండలంలోని గొల్లపల్లిలో గల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. వరిధాన్యం కొనుగోలు వివరాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ భూమేశ్వర్, గిర్థవర్ గణేష్, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్ ఉన్నారు