Friday, 6 November 2026

నెన్నెల, గొల్లపల్లి పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్.

నెన్నెల, గొల్లపల్లి పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్.
ఫొటో : నెన్నెలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్.
నెన్నెల, డిసెంబర్ 17, (జనంసాక్షి )
మండలంలోని నెన్నెల, గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలల్లో శనివారం మూడవ శనివారం సందర్బంగా నో బ్యాగ్ డే, పేరెంట్స్ మీటింగ్, బాల సభ నిర్వహించారు. సమావేశంలో పిల్లల ప్రోగ్రెస్, పాఠశాల సమస్యలపై చర్చించారు. బాల సభలో విద్యార్థులు పాటలు, కథలు, ఇతర కార్యక్రమాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. నెన్నెల సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్, ఉపాధ్యాయులు వనజ, ఉమా, గొల్లపల్లి పాఠశాల సమావేశంలో సర్పంచ్ ఇందూరి శశికళ, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, పాఠశాల హెచ్ ఎం రమేష్, ఉపాధ్యాయులు మేరీ, సంగీత, పేరెంట్స్ పాల్గొన్నారు