సర్వసభ్య సమావేశానికి సర్పంచుల వాకౌట్…
ప్రథమపౌరుని కాస్త,అప్పుల పౌరుడిగా చేస్తున్న వైన0.
నేడు కుంటాల సర్వసభ సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్ లు.
భైంసా రూరల్ డిసెంబర్ 17 జనం సాక్షి
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో నేడు సర్వసభ్య సమావేశన్ని మండల సర్పంచులు బహిష్కరణ చేశారు.సర్పంచ్ల సమస్యలని ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బిల్లులు రాకపోవడంతో తిప్పలు తప్పడం లెదంటున్న వా పోయారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ … సర్పంచ్ల సమస్యలను ఎన్ని సార్లు వినవించుకున్న కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడ0 లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గ్రామప్రథమ పౌరునిగా గ్రామస్తులు గౌరవించగా… నేడు గ్రామ పనులు చేయలేని,చేసిన పనులకు అప్పులు చేయగా అప్పుల పౌరుడిగా గుర్తిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చేసిన పనులకు బిల్లులు రాక చాలా ప్రాంతాల్లో సర్పంచుల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని,ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వెంట వెంటనే గ్రామ అభివృద్ధి కొరకు నిధులను మంజూరు చేస్తూ సర్పంచులకు ఊరట కలిగించాలని కోరారు.




