పాలకుర్తి, వరంగల్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకప్పుడు గనుల మాఫియా అధికారం చలాయిస్తే, ఇప్పుడు మద్యం మాఫియా హవా నడుస్తోందన్నారు. ప్రజల ఉమ్మడి, వ్యక్తిగత ఆస్తులను దోచుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా మారిందని అయన అరోపించారు. అంతకుముందు గ్రామంలో కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రభోదాత్మక గేయాలు పాడుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి కొమరయ్య స్మారక స్తూపానికి డాక్టర్ కె.నారాయణ ఘనంగా నివాళులు అర్పించారు.




