కృష్ణా జిల్లా: పోలీసు ఉద్యోగం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ప్రబుద్ధుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిషోర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 16 కాసుల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు, రూ. 16వేలు స్వాధీనం చేసుకున్నారు.




