కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న జేఏసీ నాయకులు..
కొమురవేల్లి (జనంసాక్షి) జూన్ 23: చేర్యాల,కొమురవెళ్లి,మద్దూరు, దూల్మిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ గురువారం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందె భీరయ్య, రెవెన్యూ డివిజన్ జేఏసీ కన్వీనర్లు రామగళ్ల నరేష్, బందిగ రాకేశ్ కృష్ణన్ ఉన్నారు.