Monday, 2 November 2026

కొమ్మనమోని రాములు యాదవ్ చేసిన సేవలు

కొమ్మనమోని రాములు యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయం- టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్ కొండమల్లేపల్లి డిసెంబర్ 31 జనం సాక్షి న్యూస్
శ్రీరామ తాపీ కార్మిక సంఘం దేవరకొండ వారి ఆధ్వర్యంలో కొమ్మనమోని రాములు సంస్మరణ సభ కార్మిక నాయకుడిగా రాములు వేసిన సేవలను కొనియాడిన వక్తలు తాపీ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు, నీటి సంఘం మాజీ చైర్మన్ కొమ్మనమోని రాములు యాదవ్ కార్మిక సంఘానికి చేసిన సేవలు చిరస్మరణీయమని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్ అన్నారు. వారు శనివారం దేవరకొండలో కొమ్మనమోని రాములు సంస్మరణ సభ దేవరకొండ శ్రీరామ తాపీ కార్మిక ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు సిరమోని రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 20 సంవత్సరాలు దేవరకొండ కార్మిక సహకార సంఘానికి అధ్యక్షులుగా పని చేసిన కొమ్మనమోని రాములు యాదవ్ కార్మికుల సమస్యల పట్ల నిరంతరం పోరాడిన వ్యక్తి అని, కార్మిక జీవితంలో ఇటు రాజకీయ జీవితంలో నిజాయితీగా కార్మికులకు సేవలందించిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ తరం కార్మికులపై ఉందని నాయకులు సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో అధ్యక్షులు టిఎన్జీవో అధ్యక్షులు హనుమంతు శ్రీనివాస్ గౌడ్, శ్రీరామ తాపీ కార్మిక సంఘం సిరమోని రాములు యాదవ్, ప్రధాన కార్యదర్శి జింకల మధు నాయకులు పొట్ట రత్నయ్య, పొట్ట శేఖర్, నేతాల వెంకటేష్ ,,శవ వెంకటయ్య, కొమ్మనమోని వెంకటేష్, కొల్లూరు మల్లయ్య, గంట యాదయ్య, ఎరుకల యాదయ్య, పుట్టం శ్రీను, గాజీ నగర్ వెంకటయ్య, ఖాదర్, కల్లెట్ల గిరి, పర్వతాలు, సవారి, చిత్రం తిరుపతయ్య, వాసు, బత్తుల సాలయ్య, శ్రీశైలం, చంటి యాదవ్, 300 మందికి మందికి పైగా కార్మిక సంఘం నాయకులు, కొమ్మనమోని రాములు యాదవ్ కుటుంబ సభ్యులు ఆంజనేయులు యాదవ