పాటిమట్ల లో పౌర హక్కుల దినోత్సవం
మోత్కూరు డిసెంబర్ 31 జనంసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మోత్కూర్ తహశీల్దార్ షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలోని ఎస్సి కాలనిలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ ఎస్సీ, ఎస్టీ లపై, కుల వివక్షత లపై జరుగుతున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాగం ద్వారా కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహ కలిగి ఉండాలని గ్రామంలోని దళితులు ఏదైనా సమస్యలు ఎదుర్కుంటున్నట్లు అయితే వాటిని పరిష్కరించడమే పౌర హక్కుల సాధన అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ, బాలిక ఎస్సి హాస్టల్ వార్డెన్ ప్రసన్న, హెల్త్ అసిస్టెంట్ వెంకన్న, పాటిమట్ల విఆర్ఎ సురారం యాదయ్య, గ్రామస్తులు గిరగాని శ్రీను, కురిమేటి సైదులు, బండి రాజు, కురిమేటి నవీన్, యాదయ్య, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.




