Monday, 2 November 2026

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ మండల నాయకులు చంద్రయ్య యాదవ్

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ మండల నాయకులు చంద్రయ్య యాదవ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్31(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంల పరిధిలోని పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన మాయని (వడ్డె) చిన్న నరసింహ అనారోగ్యంతో మృతిచెందగా సమాచారం తెలుసుకున్న జడ్పిటిసి మేకల గౌరమ్మ భర్త,బిఆర్ఎస్ మండల నాయకులు చంద్రయ్య యాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో దైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కావలి ఆంజనేయులు,ఉప సర్పంచ్ ఎల్లయ్య యాదవ్, మాజీ ఎంపిటీసి ముచ్చు గోవింద్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీరం సుదర్శన్ రెడ్డి, గండు వెంకటయ్య, ఉదయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.