బచ్చన్నపేట: జూన్ 24 (జనం సాక్షి)క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని పీసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు.బచ్చన్నపేట మండల కేంద్రంలో కొమ్మూరి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా యువకులతో క్రికెట్ ఆడి సందడి చేశారు.అనంతరం మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లెల్ల సిద్దా రెడ్డి, ఎంపీటీసీ నల్లగొని పుష్ప బాలకిషన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్,ఆలేటి సిద్దిరాములు, దిడిగ రమేష్,బుచ్చి రాజ్, అమృత రెడ్డి, సిద్దులు,మోటే శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు,జాయ మల్లేషం,కొమ్మూరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి క్రాంతి,కొమ్మూరి యువసేన జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగోని వేణు,కంఠం కరుణాకర్, అఖిల్ మాల,బక్క ప్రవర్ధన్, గాజుల రాజు యాదవ్, పోచంపల్లి నాగరాజు, మహేష్, ప్రశాంత్, క్రాంతి,సోహెల్, సంజయ్,రఘు తదితరులు పాల్గొన్నారు.





