భువనగిరి టౌన్ (జనం సాక్షి):–:–ముదిరాజ్ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో ముదిరాజ్ కులస్తుడైన ఓ టీవీ చానల్ కెమెరామన్ పై దుర్భాషలాడి, విచక్షనారహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ముదిరాజులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవీ నుండి వెంటనే భర్తఫ్ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనలసి వస్తుందని అన్నారు. కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయకుంటే రాబోయే రోజుల్లో ముదిరాజలంతా బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నర్సింహ్మ ముదిరాజ్, సంఘం రాష్ట్ర నాయకులు కుక్కదువు సోమయ్య, మాటురీ అశోక్, సాధు విజయ్ కుమార్, బిసుకుంట్ల సత్యనారాయణ జిల్లా నాయకులు మాజీ కౌన్సిలర్లు పిట్టల బాలరాజు,జహంగీర్, ఉడుత భాస్కర్, గీస కోండల్, సామల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధమ్




