సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి హుజూర్ నగర్ డిసెంబర్ 31 (జనంసాక్షి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎండి నిరంజన్, జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ సాహితి అన్నారు. శనివారం అమరవరం గ్రామంలో ఏర్పాటైన వైద్య శిబిరాన్ని సందర్శించి వారు మాట్లాడుతూ ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించడంతోపాటు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా శుభ్రమైన త్రాగునీరు, వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి కుంటలను పూడ్చివేయడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను కూడా అరికట్టవచ్చని ప్రతి శుక్రవారం తప్పకుండా డ్రై డే పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, సబ్ యూనిట్ అధికారులు శ్రీనివాసరాజు, అంజయ్య, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్, ఆరోగ్య కార్యకర్తలు రామకృష్ణ, శ్రీనివాస్, విజయ, వరలక్ష్మి, విజయలక్ష్మి, అలివేలు మంగ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి




