– నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపు
హైదరాబాద్, నవంబర్30(జనంసాక్షి) : ఈనెల 4న తలపెట్టిన కొలువులు కొట్లాట సభ ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది.. ఈ కాగా సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం, పలువురు జేఏసీ నాయకులు పరిశీలించారు. సభాస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై వారు చర్చించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విూనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగాలోస్తాయని అందరూ భావించారని, కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలను భర్తీచేసిన దాఖలాలు కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కొలువుల కొట్లాట సభను నిర్వహించటం జరుగుతుందని, నిరుద్యోగులు, యువత ఈ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. కాగా కొలువులు కొట్లాట సభ ఇప్పటి రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. గత నెల 30న సభ నిర్వహించేందుకు కోదండరాం సిద్ధమయ్యారు.. దీంతో పోలీసులు అనుమతిని నిరాకరించారు.. దీంతో సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.. హైకోర్టు అనుమతి ఇచ్చినా తేదీని మార్చుకోవాలని పోలీసులు అంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈనెల 30న అంతర్జాతీయ వ్యాపార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సందర్భంగా కొలువుల కొట్లాట సభకు భద్రత కల్పించ లేమని ప్రభుత్వం తరపు న్యాయవాది శరత్ కోర్టుకు తెలిపారు. 30 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 తర్వాత మరో తేదీ కోరితే అనుమతి ఇస్తామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 30, డిసెంబర్ 1, 6 తేదీల్లో కాకుండా మిగతా రోజుల్లో సభ జరుపుకోవచ్చని నిర్వాహకులకు స్పష్టం చేసింది. ఇందుకోసం పోలీసులకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న 40 గంటల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈనెల 4న కొలువుల కొట్లాట సభను నిర్వహించేందుకు జేఏసీ చైర్మన్ కోదండరాం నిర్ణయించారు.
కొలువుల కొట్లాట’ సభా స్థలిని పరిశీలించిన కోదండరాం




