Monday, 2 November 2026

కొల్చారం మండలంలో సమయపాలన పాటించని గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్న మండల వాసులు.

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి/ కొల్చారంప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందించాల్సిన పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా కుల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామపంచాయతీలలో పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చిన అధికారులు కేవలం రెండు గంటలు మాత్రం విధులు నిర్వహించి గ్రామంలో కనిపించకుండా పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు