Tuesday, 3 November 2026

18 ఏళ్లు పైబడిన బాలికలందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు – మాజీమంత్రి సంభాని

 

 

 

 

 

 

పెనుబల్లి, మే31(జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రాగానే 18 ఏళ్ళు దాటిన ప్రతి బాలికకు ఎలక్ ట్రిక్ స్కూటర్ పంపిణీ చేస్తామని టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు , మాజీ మంత్రి సంబాని చంద్ర శేఖర్ అన్నారు,
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా బుదవారం పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామంలో జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వంకాయల పాటి వెంకటేశ్వరరావు తో కలిసి సంబాని జోడో యాత్ర నిర్వహించారు, ఈ సంధర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు , కార్యక్రమం లో సంబా ని మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి దళితులను మోసం చేశారని అన్నారు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్లు కావస్తున్న ఇప్పటకీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసింది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు, దళితుబంధు పేరుతో దళితుల ఓట్లకోసం రూ.10లక్షల ప్రకటించి అరకొరగా ఇచ్చి దళితులను మోసం చేస్తున్నారన్నారు, నిరుద్యోగ భృతి, రైతులకు పంట రుణాలమాఫీ వంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానేరూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికీ ఇస్తామని, రూ.2 లక్షలు ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని,వైద్యం కోసం కుటుంబానికి సంవత్సరానికి ఉచితముగా 5 లక్షలు ఇస్తామని అన్నారు,మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీనిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబుఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోపిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్ నాయుడు, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసార చంద్రశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, నున్నా సురేష్, వంకాయలపాటి మురళి, కాంతారావు, మరేశ్వరావు,గద్దె శ్రీను, కర్రి సత్యనారాయణ, చిలుకబత్తుల చెన్నారావు, వెలగపూడి వసంతరావు, జిల్లెళ్ల నరసింహస్వామి, ఇజ్జగాని నాగేశ్వరరావు, బెల్లంకొండ సీతారాములు, గోగినేని రమేష్, మేకతొట్టి కాంతయ్య, దేవేంద్ర బాబు, మామిళ్ళ వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.