Tuesday, 3 November 2026

జోగులాంబ ఆలయం లో ఎట్టకేలకు కొలువు దీరిన కొత్త పాలక మండలి. జిల్లా పరిషత్ చైర్మన్,

 ప్రతినిధి. అలంపూర్ మే 31(జనంసాక్షి) మహాశక్తి పీఠలలో ఒకటైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రమేశ్వర అమ్మ ఆలయ పాలక మండలి సభ్యుల పదవికాలం ముగిసింది. గత కొన్ని రోజులుగా నూతన ఆలయ పాలక మండలి ఎన్నిక స్థానిక అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, నూతన ఎమ్మెల్సీ చల్లా వర్గల మధ్య పాలక మండలి సమస్య అధిష్టానం వరకు చేరినవిషయం తెలిసినదే. అధిష్టానం జోక్యంతో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన వారిని ఖరారు చేసింది.దీనితో బుధవారం ఉదయం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దేవాదాయ-ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్, జి. శ్రీనివాస రాజు, ఆలయ ఈ.ఓ. ఆర్. పురెందర్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు . నూతన ధర్మకర్తల మండలి సభ్యులు సి. చంద్రకళ, కే. వెంకటేశ్వర రెడ్డి ,చైర్మన్ గా బి. చిన్న కృష్ణయ్య పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ దీనికి ఆమోదం తెలిపారు., చంద్రకళ, వెంకట నారాయణ రెడ్డి, రఘు ధనుంజయ, బి. సత్యన్న, వెంకటేశ్వర రెడ్డి, చాకలి వెంకటేశ్వర్లు, బి. అంపయ్య, గొల్ల కేశన్న, అడివప్ప కే. సత్యనారాయణ, కే. రమేష్ బాబు యం. సురేఖ, ఆలయ ముఖ్య అర్చకులు మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు డి. ఆనంద్ శర్మ, ఈ కొరం లో సభ్యులుగా వున్నారు.అనంతరం నూతన పాలక మండలి సభ్యులు తో దేవాదయ శాఖ కమిషనర్ శ్రీనివాస్ రాజు ప్రమాణం చేయించారు. కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా యం.యల్.సి. చల్లా వెంకట్రామి రెడ్డి, ఢిల్లీ లో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి మంధా జగన్నాధం , జడ్.పి. చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య , మునిసిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ , వైస్ చైర్మన్ శేశి రెడ్డి , యం.పి.పి. బేగం గోకారి, జడ్.పి. టీ.సి. శంషాధ్ ఇస్మాయిల్, మరియు ఆలయ మాజీ చైర్మన్ లు, ధర్మకర్తలు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.