Tuesday, 3 November 2026

బక్రీద్ పండుగ శభాకాంక్షలతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ,జడ్పిటిసి సరిత తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల్ ఆర్ సి .జూన్ 29, (జనం సాక్షి )
మానవ జీవితాన్ని ఆదర్శ వంతంగా రూపొందించుకునే అద్భుతమైన సంస్కృతిని మన పండుగలు వెల్లడిస్తున్నాయని రాజీవ్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ పర్వదిన సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు వారి కుటుంబాలకు ఈద్గాదగ్గర వెళ్లి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని,జిల్లాలోని ముస్లిం ప్రజలలో ఉన్న ప్రత్యేకమైన ఐకమత్యం ఎంతో ఆదర్శం అని తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మాలిచేటి రాజీవ్ రెడ్డి అన్నారు.
డీకే అరుణ
మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని గద్వాల ముస్లిం ప్రజలకు కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈదుల్ ఆజా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ ప్రజల మధ్య ప్రజల కోసం బ్రతికే నాయకురాలు డీకే అరుణదే అని తెలియజేశారు.
జడ్పిటిసి సరిత* మాట్లాడుతూ ఎల్లప్పుడూ గద్వాల ప్రజలకు తమ సహాయ సహకార్యాలు ఉంటాయని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ తరఫున అతికుర్ రహమాన్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మున్సిపల్ చైర్ పర్సన్ ఇతర పార్టీ నేతలు అధ్యక్షులు కార్యకర్తలు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ..