:అశోక్ :శామీర్ పేట్, జనంసాక్షి : ప్రజల ఆరోగ్యంపై గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం శోచనీయమని కొల్తూరు మాజీ అధ్యక్షుడు అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కోల్తూరు గ్రామంలో వాటర్ ఫిల్టర్ సమస్యలతో గంటల కొద్దీ లైన్ లో నిలబడటం గ్రామప్రజల సమస్య పట్టించుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.గ్రామ ప్రజల పడుతున్న బాధను తీర్చాలన్నారు. గతంలో కొన్ని కంపనీ లు ఉజియా ఫార్మా కంపనీ ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన కొన్ని రాజకీయ పార్టీ నాయకులు ముందుకు సాగనియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్తగా వాటర్ ఫిల్టర్ గురించి నిర్మించిన గది మరియు ఫిల్టర్స్ ట్యాంక్ రెడీగా ఉన్న అభివృద్ధి కి సహకరించని అధికారులు ఎం చేస్తున్నారని ఏద్దేవా చేశారు.
ఈపాటికే ఎండలు మండుతుండటంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందు ముందు చాలా ఎండలు ఎలా ఉంటుందో చాలా భయంతో వాటర్ సమస్యతో భాద పడాల్సి వస్తోంది అని వాపోతున్నారన్నారు.ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ అధికారులను
కోరారు. లేని పక్షంలో ప్రజలతో ఏకమై పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.




