నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జులై 1(జనం సాక్షి ) కొల్లాపూర్ఏరియా హాస్పిటల్లో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏరియా హాస్పిటల్ సిభంది డాక్టర్లను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి వేడుకలనుఘనంగానిర్వహించారు.. డాక్టర్ బీదన్చంద్రరాయ్ జయంతిరోజునుజాతీయవైద్యుల దినోత్సవంగా ప్రకటించి భారత దేశ ప్రజలు జులై ఒకటవ తేదీన ప్రతి సంవత్సరం జాతీయ వైద్యులదినోత్సవవంగాజరుపుకుంటారు.మనకు జన్మనిచ్చేది తల్లిఅయితేఅవసరమైనప్పుడు తగిన చికిత్స చేసి పునర్జన్మ నిచ్చేది వైద్యుడు సమాజంలో వైద్యుల్నిభగవంతుడితోపోలుస్తారు ( వైద్యో నారాయణ హరి) ఎంతో నిబద్ధత, ఓర్పు, సహనం, సేవ నిరతితో పనిచేసే వైద్యులసేవలనుగౌరవించేదినోత్సవ నేడు.మన భారత దేశంలో ప్రముఖ వైద్యులు బిధన్ చంద్రరాయ్ జయంతిని (01.07.1882) జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. హాస్పిటల్ సిభంది డాక్టర్ బిల్లా యాదగిరి, డాక్టర్ జయచంద్ర ప్రసాద్ యాదవ్ ,డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ శిరీష, డాక్టర్ సాని నాయక్ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ జంబులయ్య, జీకే వెంకటేష్, అనిత, రహీం, నగరాణి సుజాత, వెంకటవర్ధిని, శశికళ, భారతమ్మ,మరియు సిభంది పాల్గొన్నారు.
కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ లో ఘనగా జాతీయ వైద్యుల దినోత్సవం




