Monday, 2 November 2026

రేపు రైతులకు పోడు పట్టాల పంపిణీ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

టేకులపల్లి, జూలై 1 (జనం సాక్షి ): ఎంతో ప్రతిష్టాత్మకంగా పోడు రైతులకు పోడు భూముల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబడిన పట్టా హక్కు పత్రాలను ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఇల్లందు, టేకులపల్లి గ్రామపంచాయతీలలో పంపిణీ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. పోడు రైతులకు పోడు పట్టాలను గ్రామపంచాయతీలో స్థానిక తహసిల్దార్, ఎంపీడీఓలతో కలిసి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పంపిణీ చేయనున్నారు. పంపిణీ కార్యక్రమానికి ఇల్లందు, టేకులపల్లి మండల జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.