ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలి
_ ఎంపీపీ బిక్య నాయక్
పదర జనం సాక్షి :(డిసెంబర్ 05).
ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ఎంపీపీ బిక్యా నాయక్ పేర్కొన్నారు. ఆశాడై సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ బీక్య నాయక్, జెడ్పిటిసి రాంబాబు నాయక్ సోమవారం నాడు ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 50 మందికి యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగ అభివృద్ధి కోసం అనేక సదుపాయాలు, సౌకర్యాలను కల్పిస్తున్నాయని, కార్పొరేట్ ప్రైవేట్ రంగాలకు దీటుగా ప్రభుత్వ దవాఖానలు పనిచేస్తున్నాయని వారన్నారు. కెసిఆర్ కిట్టు, ప్రతి గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి దాంట్లో పౌష్టికా ఆహారాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఆశా వర్కర్ల పనితీరుపై వారు కొనియాడారు. అనంతరం దావఖాన సిబ్బంది త్రాగునీరు సమస్య ఉందని వారి దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే నీటి సమస్యని లేకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. అదే దావఖానలో ప్రసవం జరిగిన మహిళకు కేసిఆర్ కిట్టును అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ గౌతం, ఎంపీటీసీలు సునీత శ్రీను, ఎల్లమ్మ శ్రీను, వైద్య సిబ్బందులు బిక్కులల్, మల్లయ్య, కృష్ణ, చంద్రకళ, గ్రామస్తులు నారయ్య, రాములు,తదితరులు పాల్గొన్నారు
ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలి




