నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ను రద్దు చేయాలి నర్రా శేఖర్ రెడ్డి
నాంపల్లి డిసెంబర్ 7 (జనంసాక్షి )స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రద్దు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న జీపు జాత కార్యక్రమాన్ని బుధవారం జడ్పిహెచ్ఎస్ నాంపల్లి లో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుత , ప్రపంచ బ్యాంకు ఆదేశిత పెన్షన్ సంస్కరణలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, జాతీయ పెన్షన్ విధానం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు శాపంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం-2020 వికేంద్రీకరణ,వ్యాపారీకరణ, కషాయికరణలను పెంచి పోషించేదిగా ఉందని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల అధ్యక్షులు సిలువేరు నారాయణ , కనగల్లు అధ్యక్షులు సైదులు, చండూరు ప్రధాన కార్యదర్శి సైదులు, నాంపల్లి ప్రధానోపాధ్యాయులు సంజీవరావు తదితరులు
పాల్గొన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ను రద్దు చేయాలి నర్రా శేఖర్ రెడ్డి




