జనం సాక్షి :కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్
క్రీడాకారులను ప్రోత్సహించాలి టీపీపీ సభ్యులు రంగినేని అభిలాష్ రావు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని సోమశిల జంక్షన్ దగ్గర జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా.సోల పోగుల స్వామి గారి అధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలను ప్రారంభించిన టీపీసీసీ సభ్యులు శ్రీ రంగినేని అభిలాష్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని 2కే రున్ జండా ఊపి ప్రారంభించారు అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంథ్లేటిక్స్ క్రీడాకారులు చిన్నారులు మరియు కాంగ్రెస్ నాయకులతో కలసి కేకు కట్ చేసిన టీపీసీసీ సభ్యులు శ్రీ రంగినేని అభిలాష్ రావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను అధ్లాంటిక్ క్రీడల్లో పరిచయం చేస్తున్న జిల్లా అధ్లాంటిక్ కార్యదర్శి స్వాములుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులతో పాటుగా క్రీడల్లో రాణించడంతో ఆరోగ్యంగా ఉంటారు స్పోర్ట్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.మన రాష్ట్రంలో స్పోర్ట్స్ కు సంబంధించి నామమాత్రంగా ఉంది అన్నారు అభివృద్ధి చేస్తలేరన్నమాట వాస్తవం అన్నారు అనుకున్న మేరకు నిధులు కేటాయిస్తలేరని అన్నారు స్పోర్ట్స్ కు సంబంధించి మీకు ఎప్పుడు సహాయ సహకారం ఇస్తానని పిసిసి సభ్యులు అభిలాష్ రావు హామీ ఇచ్చారు.జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు గారు మాట్లాడుతూ ఈనెల 18వ తారీఖున మహబూబాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే 8వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల కొరకైజిల్లా స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఎంపికలను కొల్లాపూర్ పట్టణం లో ఈ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో హాసిని బీ పీ ఈ డి కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ ప్రిన్సిపాల్ అభిరామ్ అసోసియేషన్ ఈసీ మెంబర్ శ్రీకాంత్ పీ ఈ టీ రామకృష్ణ , టీచర్లు కోళ్ల కిరణ్ కుమార్ దయ్యపు రాజు విజయశాంతి సురేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశపోగుల రవికుమార్, తగిలి కృష్ణయ్య భోగ్యం నరసింహ పరమేష్ గంగాధర్ తేజ వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు.ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకై దాతలు ముందుకు రావాలి నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సోలాపొగుల
స్వాములు కోరారు
కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్




