Thursday, 5 November 2026

బైండోవర్ ఉల్లంఘన కేసులో మహిళకు లక్ష జరిమాన విధించిన మండల మెజిస్ట్రేట్

బైండోవర్ ఉల్లంఘన కేసులో మహిళకు లక్ష జరిమాన విధించిన మండల మెజిస్ట్రేట్*

మెట్ పల్లి, డిసెంబర్ 9 () : మెట్పల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో శుక్రవారం రోజున మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ రాధ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ పట్టుబడినట్లు మెట్పల్లి పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐ రాధ తెలిపారు. పట్టుబడిన మహిళను స్థానిక ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయగా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. కానీ మహిళ తీరు మార్చుకోపోగా అదేపనిగా నాటు సారాయి విక్రయించడంతో కేసు నమోదు చేసి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మండల మెజిస్ట్రేట్ రవీందర్ ఒక లక్ష రూపాయల జరిమానా విధించగా ఆ లక్ష రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్టు మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ రాధ తెలిపారు. ఇకపైన నాటు సారాయి అమ్మను అని మొదటి తప్పుగా భావించి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నాటు సారా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా సారాయి విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని 9440902708 కు కాల్ చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై సమ్మయ్య, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు