వైయస్సార్ టిపివైయస్సార్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు.
పోలీసుల జోక్యంతో దీక్షల విరమణ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్.10.(జనంసాక్షి). వైయస్సార్ టి పి.అధ్యక్షురాలు దీక్షలను భగ్నం చేయడంపై ఆగ్రహించిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు గాంధీ చౌరస్తా వద్ద నిరసనకు శనివారం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం విగ్రహం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైయస్సార్ టిపి జిల్లా చొక్కాల రాము మాట్లాడుతూ ప్రజాస్వామ్యుతంగా దీక్షలు చేస్తున్న పార్టీ అధ్యక్షురాలు షర్మిల దీక్షలను పగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు. దీక్షలు చేస్తున్న వైఎస్సార్ టి పి కార్యకర్తలను పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమింప చేశారు. నిరసన కార్యక్రమంలో పలురు వైఎస్ఆర్ టిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




