కోటగిరి జనవరి 26 జనం సాక్షి:-భారత దేశ 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు వారం కోటగిరి,పోతంగల్ మండలాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి మండలాలోని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాల యాలు,విద్యాసంస్థలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.జాతి పిత మహాత్మా గాంధీ,రాజ్యాంగ నిర్మాత డా.బి.అర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ,రెవెన్యూ కార్యాలయాలలో ఎమ్మార్వో, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ,మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మెన్ అంతేగాక మండలంలో పలు పంచాయతీ కార్యాలయాలలో సర్పంచ్లు,పిఎసిఎస్ కార్యాలయంలో ఛైర్మెన్లు,ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురవేసి వందన స్వికారం చేశారు.అనంతరం పిల్లలకు, పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు.




