* అధ్యక్షులుగా ధర్మపురి శ్రీనివాసాచారిటేకులపల్లి, ఫిబ్రవరి 8 (జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా ధర్మపురి శ్రీనివాసచారిని, ప్రధాన కార్యదర్శిగా నోముల భాస్కరాచారి ఎన్నుకున్నారు. కోశాధికారిగా చంద్రగిరి రాధాకృష్ణ, బొడ్డుపల్లి బ్రహ్మచారి, అనంతోజు చంద్ర చారి, కట్టుకొజ్వల సురేష్, తవుడోజు తిరుపతి, ప్రచార కార్యదర్శులుగా వజ్రాల పరిపూర్ణ చారి, పర్వతం ఉపేంద్ర చారి, సహాయ కార్యదర్శులుగా పంతంగి శ్రీనివాస్, తవుడోజ్ సందీప్, గజ్జల రామ్మోహన చారి, ఉరిమెళ్ళ భరత కృష్ణ, గన్నవరపు అరవింద్, వెనగంటి రవీంద్ర చారి, సలహాదారులుగా ఉరిమెళ్ళ యాదాచారి, గుంతోజు కృష్ణ , నోముల భానుచందర్, ధర్మపురి రవికుమార్, మరి కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.శ్రీ శ్రీ శ్రీ శ్రీ భవానీ శంకర సహిత, శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ ఛైర్మన్ తౌడోజు బిక్షమయ్య అధ్యక్షతన టేకులపల్లి విశ్వబ్రాహ్మణల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు.




