Sunday, 8 November 2026

కోటగిరి నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం.

కోటగిరి నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం.
మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎండి అబ్దుల్ హమీద్,వైస్ చైర్మన్గా చెన్నూర్ రామ్ రెడ్డి.

కోటగిరి 24 జనం సాక్షి:-వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు సేవ చేయడానికి తప్ప రాజకీయాలు చేయడానికి కాదు,ప్రతిపక్షాలు అజ్ఞానంతో మాట్లాడితే సబబు కాదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం రోజు కోటగిరి మండల నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం మండల కేంద్రంలోనీ మార్కెట్ కమిటీ ఆవరణంలో జరిగింది.మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎండి అబ్దుల్ హమీద్,వైస్ చైర్మన్ గా చెన్నూర్ రామ్ రెడ్డి తో పాటు పాలకవర్గ సభ్యులు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ. కొందరు మతిభ్రమించి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూన్నారు.మా కుటుంబంలో ఒకరికి ఓటు వేస్తే ముగ్గురం పని చేస్తున్నామ్. ఏనాడు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మా కుమారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు నోరు ను అదుపులో పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాలని ఘాటుగా హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మీరు పాలించే రాష్ట్రాలలో అమలు చేసి మాట్లాడండి.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉందన్నారు. ప్రజల చేత ఎన్నుకో బడ్డ ప్రభుత్వాలను పడగొట్టే వారు నాయకులు కారు.ప్రజల ఆకాంక్షల మేరకు పని చేసేవారే నాయకుల అని అన్నారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీలోకి రూ.50 లక్షలతో వేసిన నూతన సిసి రోడును ఆయన ప్రారంభించారు.అలాగే మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చేక్కులను పంపించేశా రు.తదనంతరం మండల కేంద్రంలోని విఆర్ ట్రేడర్స్ డీలర్ ఫర్ బర్జర్ పాయింట్ షాప్ని ప్రారంభించారు.అనంతరం కోటగిరి మండల సీనియర్ నాయకులైన హౌగిర్ రావు పటేల్ తల్లి కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.తదనంతరం మండలంలోని జిల్లాపల్లి ఆబాది గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించా రు.ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ వల్లేపల్లి సునిత శ్రీనివాస్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, రాష్ట్ర మైనార్టీ నాయకులు తారీక్ అన్సారీ, ఎజాస్ ఖాన్,సిరాజ్, ఇస్మాయిల్,నీరడి గంగాధర్ కొల్లూరు కిషోర్,మండల సర్పంచ్లు,ఎంపీటీ సీలు సొసైటీచైర్మన్లు,మండల,జిల్లా అధికారులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,
రైతులు పాల్గొన్నారు