Sunday, 8 November 2026

డిసెంబర్ 26 సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయండి

డిసెంబర్ 26 సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయండి సిపిఐ మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వర్ రెడ్డి
కొండమల్లేపల్లి డిసెంబర్ 24 జనం సాక్షి న్యూస్ :
సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయాలని సిపిఐ కొండమల్లేపల్లి మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. భారత స్వతంత్ర సంగ్రామ పోరాటంలోను తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలోను భారత కమ్యూనిస్టు పార్టీ మహోన్నతమైన పాత్రను పోషించిందని ఇలా దేశంలో జరిగిన అన్ని ప్రజా ఉద్యమంలో పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ ఉందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాజకీయాలకు మతం రంగు పులిమి రాజకీయాలను కలుషితం చేసి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాధత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి యేతర శక్తులు ఏకమై కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దగించకపోతే భారతదేశాన్ని నిలువునా అమ్మేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబర్ 26 భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని అన్ని శాఖలలో జెండాలు ఎగుర వేసి జయప్రదం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు