కోటగిరి మండలంలో అంబేద్కర్ కి ఘన నివాళి.
కోటగిరి డిసెంబర్ 6 జనం సాక్షి:-బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా స్వరాజ్యం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సిద్ధిస్తుంన్నదని బాన్సువాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే నేడు దళితులు,గిరిజనులు, బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు.బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే రాష్ట్ర సిఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నా రని అన్నారు.అందుకు నిదర్శనంగా కేసీఆర్ నాయకత్వంలో దళితులకు దళిత బంధువు,మూడు ఎకరాల భూ పంపిణీ,దళిత రుణాలు,తదితర పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. నేటి యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని,ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల మాల మహానాడు సంఘం ఐక్య వేదిక కమిటీ అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న,స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సిరాజ్,స్థానిక సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు, ఎత్తొండ సర్పంచ్ సిరిగిరి సాయిబాబా,ఎంపీటీసీ ఫరూక్ వల్లేపల్లి శ్రీనివాస్,కొల్లూరు కిషోర్,సలీం,హమీద్,కులకర్ణి అనిల్,బర్ల మధు,అనంత విఠల్,సాయిలు,రాములు, సైదయ్య,గంగారం,దళిత నాయకులు,యువత తదితరులు పాల్గొన్నారు.




