భువనగిరి టౌన్ (జనం సాక్షి):– మున్సిపల్ సాధారణ సమావేశంలో 19 మరియు 26 వార్డులలో నెలకొని ఉన్నటువంటి సమస్యలపై 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి ఎస్ డి ఎప్ నిధుల ద్వారా మంజూరు అయినటువంటి పనులకు గత 11 నెలల క్రితం టెంకాయలు కొట్టి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు కమిషనర్ నాగిరెడ్డి శంకుస్థాపన చేసినటువంటి పనులు నేటి వరకు కూడా పూర్తి కాకపోవడం సిగ్గుచేటైన విషయమని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి నిధులకే దిక్కు దివానా లేకపోవడం వారి యొక్క పాలనకు నిదర్శనంగా అసమర్థత ఏ విధంగా ఉందో తెలుస్తుందని పట్టణంలోని 19వ వార్డు 26 వార్డులలో నెలకొని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారుల పైన ఒత్తిడి చేస్తూ నిలదీయడం జరిగింది*19 వ వార్డు కౌన్సిలర్ వడిచెర్ల లక్ష్మీ గారు మాట్లాడుతూ వార్డులలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యంగా కుక్కల దాడిలో చాలామంది ప్రజలు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్ పాలవుతున్నారని ఒక్కో సందర్భంలో కుక్కలు వెంటాడుతుంటే ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగతాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తక్షణమే కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు




