కోడిపందెలపై పోలీసులు దాడులు
మల్దకల్ డిసెంబర్ 20(జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామ శివారులో మంగళవారం కొందరు వ్యక్తులు కోడిపందెం ఆడుతున్నారని సమాచారంతో మల్దకల్ పోలీసులు దాడి చేసి చేశారు. పోలీసులు నలుగురు వ్యక్తులను,రెండు కోళ్లను, 5030 రూపాయలుస్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు.పోలీసుల దాడుల్లో ఎస్ఐ ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఈశ్వరయ్య ,హెడ్ కానిస్టేబుల్ నిత్య పూజయ్య, సిబ్బందిరఘురెడ్డి,చంద్రశేఖర్,కుమార్,నిరంజన్ తదితరులు ఉన్నారు




