జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు తుంకుంట విద్యార్థులు
తుంకుంటకు చెందిన జి హేమంత్, సుధీర్ కుమార్ లు ఇటీవల న్యూ బోయిన్ పల్లి లోని కంటోన్మెంట్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచారు. రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన తూముకుంట జై హింద్ క్లబ్ కు చెందిన హేమంత్, సుధీర్ కుమార్ లు జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26 నుండి 30 వరకు పశ్చిమ బెంగాల్ లో జరిగే 41 వ జాతీయ స్థాయి జూనియర్ ఖో-ఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని కోచ్ గుర్రం సత్తిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైన హేమంత్, సుధీర్ కుమార్ , సీనియర్ క్రీడాకారులు ప్రజలు అభినందనలు తెలిపారు.
20ఎస్పీటీ -1: ఎపింకైన క్రీడాకారులతో కోచ్




