Tuesday, 3 November 2026

కోదండరాం, శ్రీనివాస్‌ గౌడ్‌ అరెస్టు

హైదరబాద్‌: చలో అసెంబ్లీ కి బయలుదేరిన తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మెన్‌ కోదండరాం, టీఎన్జీవోనేత శ్రీనివాస్‌ గౌడ్‌ను అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా కోదండరాం ,శ్రీనివాస్‌గౌడ్‌లు రోడ్డు పైనే భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఐకాస కార్యకర్తలు  రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనతెలుపుతున్న తమ పై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడిక్కడే నిరసనలు వ్యక్తం చేయాలని పిలుసునిచ్చారు. చలో అసెంబ్లీ కి ఎన్ని అడ్డంకులు సృష్టించినా నైతికంగా తెలంగాణ ప్రజలే విజయం సాధించారని కోదండరాం వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఉద్యమం కొనసాగుతుందని ఈ రోజు సాయంత్రం ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నట్లు కోదండరాం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *