కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలలో పాల్గొన్న సర్పంచ్ పొడవు శ్రీనివాసులు
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (2): వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని గోపాల్ పేట్ మండల కేంద్రంలోని కోదండరామస్వామి దేవస్థానంలో గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని గరుడవాహన సేవ ఉత్తర పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి పల్లకిని మోశారు ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకున్నారు ఉత్తర ద్వార దర్శనంలో ప్రజలు తెల్లవారుజామునే దర్శనం చేసుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రంగాచార్యులు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు




