జిల్లాస్థాయి సీనియర్ పురుషులు మహిళల సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలను ప్రారంభంచిన ఎంపీపీ సజన్,ఎంఇఓ భూమారెడ్డి.
నేరదిగొండ జనవరి2(జనంసాక్షి):
మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలల్లో సోమవారం రోజున మహిళా పురుషుల జిల్లాస్థాయి ఎంపిక పోటీలను స్థానిక మండల ఎంపీపీ రాథోడ్ సజన్ ఎంఈఓ భూమారెడ్డిలు ప్రారంభంచారు.ఈ పోటీలకు దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ పోటీలో 25 మంది క్రీడాకారులను ఎంపిక చేసారు. వీరికి వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చి అర్హులైన16 మంది క్రీడాకారులను రాష్ట్రస్తాయి ఫోటీలకు ఎంపిక చేసి పంపుతారని జిల్లా ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షలు గోడం జ్యోతిరం ఎలావెన్ క్రికెట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ గుత్పలా గ్రామపంచాయితీ సర్పంచ్ గస్కంటి రవి.సాఫ్టబాల్ జాయింట్ సెక్రటరీ నాగరాజ్ తిరుపతి పిఈటీలు కవిత గౌతమ్ సునీతగణేష్ పాల్గొన్నారు.
జిల్లాస్థాయి సీనియర్ పురుషులు మహిళల సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలను ప్రారంభంచిన ఎంపీపీ సజన్,ఎంఇఓ భూమారెడ్డి.




