Saturday, 7 November 2026

కోమటికుంట గ్రామంలో త్రాగునీటి గేట్ వాల్ లో డ్రైనేజీ వాటర్

కోమటికుంట గ్రామంలో త్రాగునీటి గేట్ వాల్ లో డ్రైనేజీ వాటర్
లింగాల జనం సాక్షి
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ మెయిన్ వాటర్ ట్యాంక్ కి గేటు వాలు తూతూ మంత్రంగా ఫిటింగ్ చేశారు డ్రైనేజీ కాలువ పగలగొట్టి పక్కనే గేట్ వాల్ పెట్టి పిటింగ్ చేసారు డ్రైనేజీ కాలువ ద్వారా మురికి నీరు గేట్ వాల్ గుంతలోకి వెళ్లి త్రాగునీటి పైప్ లైన్ లోకి డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది తాగునీరు కలుషితం ద్వారా గ్రామ ప్రజలకు విష జ్వరాలు వస్తున్నాయి అదేవిధంగా బీసీ కాలనీ మరియు నాలుగో వార్డ్ లో ఇప్పటి వరకు కూడా మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందించలేకపోయారు సంబంధిత కాంట్రాక్టు వారిని ఆరా తీయగా మా యొక్క బడ్జెట్ పూర్తిగా అయిపోయినది కావున మీరు సొంత నిధుల ద్వారా పైపు లైన్స్ వేసుకోవాలని చెబుతున్నారు కావున సంబంధిత అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు