తపాల శాఖ ద్వారా వైకుంఠ ఏకాదశి అంతరాలయం ప్రత్యేక అర్చన సేవలు
మోత్కూరు డిసెంబర్ 21 జనంసాక్షి : జనవరి 2 తేదీ 2023 న ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారము ద్వారా భగవంతుణ్ణి దర్శనము చేసుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది. ఆ రోజున అంతరాలయ దర్శనం కానీ అంతరాలయం లో అర్చన సేవలకు వైష్ణవ దేవాలయాల్లో అవకాశం ఉండదు. కావున తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ , తపాల శాఖ సౌజన్యంతో 02-01-2023న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయ అంతరాలయం లో అర్చన సేవా సదుపాయాన్ని భక్తులకు కేవలం 210 రూపాయలకే కల్పించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక అర్చన సేవలో భాగంగా భక్తులకు 1. పసుపు 2. కుంకుమ 3. మిస్త్రి 4. కిస్మిస్ మరియు కాజు 5.అక్షింతలు 6. దేవుని లామినేషన్ ఫోటో తపాల శాఖ పోస్ట్ ద్వారా భక్తుల ఇంటి అడ్రస్ కి పంపబడును.ఈ అవకాశం తేదీ 31-12-2022 వరకే అందుబాటులో ఉంటుంది. కావున ఇట్టి వైకుంఠ ఏకాదశి అంతరాలయం ప్రత్యేక అర్చన సేవల సదవకాశాన్ని ప్రజలందరూ తమ సమీప తపాలా శాఖ కార్యాలయం ద్వారా సద్వినియోగం చేసుకోగలరని సి.హెచ్. రవి, నల్గొండ నార్త్ సబ్ డివిజనల్ అధికారి ఒక ప్రకటన లో తెలియజేశారు




